stockmarket: ఫెడ్‌ ఎఫెక్ట్‌, కరెక్షన్‌

17 Jun, 2021 09:28 IST|Sakshi

15700 దిగువకు నిఫ్టీ

అన్ని రంగాల్లోనూ ప్రాఫిట్‌బుకింగ్‌

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో గురువారం ట్రేడింగ్‌ను ఆరంభిచాయి. యూఎస్‌ ఫెడ్‌  వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లు  అమ్మకాలతో కుప్పకూలాయి. మెటల్‌, బ్యాంకింగ్‌, షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు అదానీ గ్రూపు  షేర్లలో కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 296 పాయింట్లు కుప్ప కూలి 52205 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 15673 వద్ద కొన సాగుతున్నాయి.  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, టాటా స్టీల్‌, హీరమోటో, బజాజ్‌ ఫిన్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి. ఫెడరల్‌ బ్యాంకు, టాటా టెలీ , శ్రీ రేణుక లాంటి షేర్లు స్వల్పంగా లాభపడు తున్నాయి. 

మరిన్ని వార్తలు