భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

18 Jan, 2021 15:25 IST|Sakshi

సాక్షి, ముంబై:  సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు  తీవ్ర  ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌   26 పాయింట్ల లాభానికి  చేరినా,  ఆ తరువాత 400 పాయిం‍ట్లు కోల్పోయింది. నిప్టీ 14,300 దిగువకు చేరింది. మళ్లీ కొనుగోళ్లతో పుంజుకున్నా తిరిగి ఏకంగా 600 పాయింట్ల నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 454 పాయింట్లకుపైగా నష్టంతో 484 75 వద్ద, నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 14244 వద్ద కొనసాగు తోన్నాయి.  మెటల్‌, ఆటో, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి.  

అయితే  ప్రముఖ కార్ల సంస్థ టెస్లాతో ఒప్పందం కుదుర్చుకుందన్నవార్తలతో టాటా  మోటార్స్‌  కొనుగోళ్ల ధోరణి నెలకొంది. అయితే ఈ వార్తలను సంస్థ కొట్టి పారేసింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌గా ట్రేడవుతోన్నాయి. యూపీఎల్‌ , హెచ్‌డీఎఫ్‌సీ,  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్రిటానియా  టాప్‌ గెయినర్స్‌గా ఉండగా,. టాటా స్టీల్‌ , హిందాల్కో , కోల్‌ ఇండియా ఇండస్‌ఇండ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు