ఆటో, ఐటీ, మెటల్ మెరుపులు: లాభాల ముగింపు

6 May, 2021 15:40 IST|Sakshi

ఆటో, ఐటీ, మెటల్  షేర్లలో లాభాలు

 ప్రభుత‍్వ రంగ  బ్యాంకులు, ఫార్మ  స్టెక్టార్‌లో నష్టాలు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఆరంభంలో లాభనష్టాలమధ్య ఊగిస లాడిన సూచీలు చివరికి భారీ లాభాలతో ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి.  సెన్సెక్స్‌ 272 పాయింట్లు ఎగిసి 48949 వద్ద, నిప్టీ 107  పాయింట్ల లాభంతో 14725 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 49 వేలకు చేరువలో ఉంది. నిఫ్టీ 14700 స్తాయికి ఎగువన ముగియడం విశేషం. మెటల్‌, ఆటో, ఐటీ  లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా నష్టపోయాయి. అయితే ఐడీబీఐ బ్యాంక్ 15 శాతం ర్యాలీ అయింది.  ఇంకా బజాజ్ ఆటో, ఒఎన్‌జిసి,  బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. సిప్లా, యుపీఎల్, హెచ్‌సిఎల్ టెక్స, సన్ ఫార్మా నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు