StockMarketOpening: బుల్‌దౌడు, రూపాయి జోరు

11 Nov, 2022 10:26 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలర్‌ బలహీనపడటంతో  గ్గోబల్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. దీంతో  దలాల్ స్ట్రీట్‌లో ఉత్సాహం నెలకొంది.  ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు, వరుస నష్టాలకు  చెక్‌ చెప్పాయి.  సెన్సెక్స్‌ 1001 పాయింట్లు ఎగిసి 61614వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు లాభంతో 18313 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

ఒక్క ఆటో తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.  ఐటీ ఇండెక్స్ 3.2 శాతం,  బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం    ఎగిసాయి.  ఇన్ఫోసిస్‌, అపోలో హాస్పిటల్స్ , హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర భారీగా లాభపడుతుండగా, ఐషర్‌ మోటారస్‌, హీరో మోటా, బ్రిటానియా, ఎం అండ్‌ ఎం నష్టపోతున్నాయి.

రూపాయి జోరు
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా రూపాయి 23 పైసలు ఎగిసి 80.80 వద్ద కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఆల్‌ టైమ్‌ కనిష్టానికి పడిపోయిన రూపాయి గత  మూడు రోజులుగా లాభాల్లో ఉంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోవడం, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తప్పదనే అంచనాల మధ్య డాలర్‌ పతనమైంది.

మరిన్ని వార్తలు