StockMarketUpdate:వడ్డీ రేటుపెంపు అంచనాలు, అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

6 Dec, 2022 15:35 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో  ఆరంభంలో భారీగా నష్టపోయిన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి.  కానీ హై స్థాయిల వద్ద సూచీల కన్సాలిడేషన్‌ కొన సాగుతోంది.  చివరికి సెన్సెక్స్‌ 208 పాయింట్ల నష్టంతో 62626 వద్ద, నిఫ్టీ 58పాయింట్ల నష్టంతో 18642 వద్ద స్థిరపడ్డాయి. 

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, నెస్లే, బ్రిటానియా నష్టపోగా ఎస్‌బీఐ లైఫ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా బాగా లాభపడ్డాయి. సిమెంట్‌ ధరలు పెరుగుతాయన్న అంచనాలో అన్ని సిమెంట్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి.  బీపీసీఎల్‌,  టాటాస్టీల్‌,   డా.రెడ్డీస్‌, హిందాల్కో  యూపీఎల్‌ టాప్‌  లూజర్స్‌గా నిలిచాయి.  

ఆగని రూపాయి పతనం
డాలరు మారకంలో రూపాయి  భారీగా కుప్పకూలింది. ఏకంగా 96 పైసలు కుప్పకూలి 82.57 స్థాయికి చేరింది. మరోవైపు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు(బుధవారం)  తన విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీరేటుపెంపునకే మొగ్గు  చూపవచ్చని  అంచనాలు  నెలకొన్నాయి.  
 

>
మరిన్ని వార్తలు