పోయిన మొబైల్‌ని కనిపెట్టండి ఇలా..?

11 Jan, 2021 18:53 IST|Sakshi

మీ ఆండ్రాయిడ్ మొబైల్ పోయిందా? దానిని కనిపెట్టడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఇలా చేస్తే పోయినా లేదా దొంగిలించబడినా మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. గూగుల్ ప్రత్యేకించి పోయిన లేదా దొంగిలించబడినా మొబైల్ కనిపెట్టడం కోసం ఒక యాప్ ని రూపొందించింది. ఆ యాప్ ఇప్పుడు మీకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంది. ఫైండ్ మై డివైజ్ అనే యాప్ ద్వారా మీరు పోగుట్టుకున్న ఫోన్‌ను వెతకవచ్చు లేదా మీ మొత్తం డేటాను తొలగించవచ్చు. అయితే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. (చదవండి: టిక్‌టాక్ గురుంచి ఒక క్రేజీ అప్‌డేట్‌

మొబైల్ ని కనిపెట్టండి ఇలా.. 
ఆండ్రాయిడ్ "ఫైండ్ మై డివైజ్ యాప్"లో పోయిన మొబైల్ లో యాక్టీవ్ గా ఉన్న జీ-మెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీకు అందులో కనిపించే మెనులో పోయిన ఫోన్ ఏదో ఎంపిక చేసుకోవాలి. అనంతరం లొకేషన్ ఎంపిక చేసుకోగానే మీకు పోయిన ఫోన్ ఉన్న మ్యాప్ కనిపిస్తుంది. అందులో మీ పోయిన మొబైల్ ఫోన్ లొకేషన్ దగ్గరగా ఉంటే వెంటనే "ప్లే సౌండ్" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పోయిన మొబైల్ ఫోన్ సైలెంట్‏లో ఉన్న 5 నిమిషాల పాటు అలారం మోగుతూనే ఉంటుంది. వెంటనే మీ ఫోన్ ఎక్కడ ఉందో క్షణాల్లో మీరు తెలుసుకోవచ్చు. కానీ పోయిన మొబైల్ లో లొకేషన్ ఆఫ్ ఉంటే మాత్రం ఫోన్ లొకేషన్ వెతకడం కష్టమవుతుంది. అలాగే, మీరు పోగుట్టుకున్న మొబైల్ లోని డేటాని సేవ చేసుకోవాలంటే మాత్రం ఫోన్ స్క్రీన్ లాక్ చేయడం తప్పనిసరి. ఫైండ్ మై డివైజ్ అనే యాప్ నుంచి లాక్ మై ఫోన్ సెలక్ట్ చేసుకోవాలి. దింతో మీ మొబైల్ ఎక్కడ ఉన్న లాక్ అయిపోతుంది. ఇక మీ ఫోన్లో ఉన్న డేటాను ఎవరు యాక్సెస్ చేయలేరు.

   

మరిన్ని వార్తలు