వీడియో ఓటీటీ మార్కెట్‌

19 Jul, 2021 06:27 IST|Sakshi

@ 12.5 బిలియన్‌ డాలర్లు

2030 నాటికి ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీ వీడియో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) మార్కెట్‌ 2030 నాటికి 12.5 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. నెట్‌వర్క్‌లు మెరుగుపడటం, డిజిటల్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021లో 1.5 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 2025 నాటికి 4 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలు .. ప్రాంతీయ భాషల్లో మాట్లాడే జనాభా మొదలైన అంశాలు ఓటీటీ ప్లాట్‌ఫాం వృద్ధికి తోడ్పడనున్నాయని తెలిపింది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి టాప్‌ ఫేవరెట్స్‌తో పాటు పలు స్థానిక, ప్రాంతీయ సంస్థలు కూడా ఓటీటీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది. సోనీలైవ్, ఊట్, జీ5, ఇరోస్‌నౌ, అల్ట్‌బాలాజీ, హోయ్‌చొయ్, అడ్డా టైమ్స్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు