ఇంట్లో చెడిపోయే పండ్ల వాసన పసిగట్టే గాడ్జెట్‌!

28 Aug, 2022 10:21 IST|Sakshi

ఆహార పదార్థాల వృథా ప్రపంచవ్యాప్త సమస్య. దీనిని అరికట్టాలంటూ అంతర్జాతీయ సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఫలితం నామమాత్రం. కూరగాయలు, పండ్లు వంటివి ఎప్పట్లోగా చెడిపోతాయో ముందుగా గుర్తించే పరిస్థితులు లేకపోవడం ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఆహార వృథాను అరికట్టడానికి ‘స్నూట్‌’ పేరిట కృత్రిమ నాసికను బ్రిటన్‌కు చెందిన నార్తంబ్రియా యూనివర్సిటీ విద్యార్థి హారియట్‌ ఆల్మండ్‌ రూపొందించాడు. 

ఇది కూరగాయలు, పండ్లు, పాలు, వెన్న, పెరుగు వంటి పదార్థాల నుంచి వెలువడే వాయువుల ఆధారంగా అవి తాజాగా ఉన్నాయో, చెడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయో ఇట్టే చెప్పేస్తుంది. అంతేకాదు, ఈ పరికరం వంపు తిరిగిన చోట మూతిలా తెరుచుకున్న భాగం ఉంటుంది. 

ఇందులోంచి వాసన చూసిన పదార్థాలతో అప్పటికప్పుడు తయారు చేసుకోగల రెసిపీలను ముద్రించి మరీ అందిస్తుంది. హారియట్‌ ఆల్మండ్‌ ఆటవిడుపుగా తయారు చేసిన ఈ పరికరం ఇంకా మార్కెట్‌లోకి రాలేదు.

మరిన్ని వార్తలు