జర్మనీలో వరంగల్‌ యువకుడి గల్లంతు

10 May, 2022 08:52 IST|Sakshi

వరంగల్‌: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్‌కి చెందిన యువకుడు అక్కడ గల్లంతయ్యాడు. నగరంలోని కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్‌ (26) జర్మనీలోని హోట్టోవన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్‌ సోలార్‌ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్‌లో ఉన్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

అఖిల్‌ తండ్రి కడారి పరుశురాములు వరంగల్‌లో మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతవడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది. 
 

చదవండి:  ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి

మరిన్ని వార్తలు