‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడే విడుదల

14 May, 2021 10:54 IST|Sakshi

6.82 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ,48–మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా

6జీబి ర్యామ్‌ ,128 జీబి స్టోరేజ్‌ ,90 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌రేట్‌

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ∙6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర: రూ.14,999, n గేమింగ్‌: నేడే విడుదల

ఓపెన్‌ వరల్డ్‌ సౖర్వేవల్‌ యాక్షన్‌–అడ్వెంచర్‌ వీడియోగేమ్‌ ‘సబ్‌నౌటిక’  2014 నుంచి గేమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. తాజా వెర్షన్‌ ‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడు విడుదల అవుతుంది. ఏలియన్‌ ఎన్విరాన్‌మెంట్‌ను ఎక్స్‌ప్లోర్‌ చేయడం, సౖర్వేవ్‌ కావడం గేమ్‌ ప్లాట్‌.

ప్లాట్‌ఫామ్స్‌: మైక్రోసాప్ట్‌ విండోస్, ప్లేస్టేషన్‌–4,5, ఎక్స్‌బాక్స్‌ వన్, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్, ఎస్‌
► ఫ్యూచర్‌ టెన్స్‌
వీడియో వారిది–భాష మనది!
వీడియో టైటిల్స్, డిస్క్రిష్షన్స్, కాప్షన్స్‌ స్థానిక భాషలలో ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌లెషన్‌ చేసే కొత్త ఫీచర్‌ను వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ తీసుకురానుంది. వెబ్‌ ఇంటర్‌ఫేస్, మొబైల్‌ యాప్‌ రెండిట్లోనూ ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్‌ నుంచి పోర్చ్‌గీస్, టర్కిష్‌లకు మాత్రమే ఇది పరిమితం. స్థానిక భాషలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు.

►సోషల్‌ మీడియా ట్విట్టర్‌ టిప్‌ జార్‌
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫ్లామ్‌ ట్విట్టర్‌ ‘టిప్‌ జార్‌’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ క్రియేటర్‌లకు ఎంతో కొంత డబ్బును డొనేట్‌ చేయవచ్చు. సెలెక్ట్‌ యూజర్లు (జర్నలిస్టులు, నిపుణులు...మొదలైవారు) ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో ట్విట్‌ చేసేవారికే ఇది పరిమితం.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు