ఉత్తమ బిల్డర్‌ కావాలంటే?

30 Apr, 2022 20:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణంలో నాణ్యత, గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం, కొనుగోలుదారులు సత్సంబంధాలు, ఉపాధి, ఆర్థిక సహకారం అందించే ఏ డెవలపర్‌ అయినా విజయం సాధిస్తాడని నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆర్క్‌ గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. దుబాయ్‌లో జరిగిన రియల్టీ 2.0 సదస్సులో పాల్గొన్న ఆయన ‘ఎగ్జిక్యూటింగ్‌ యువర్‌ లీడర్‌షిప్‌ విజన్‌ యాస్‌ ఏ రియల్టర్‌’ అనే అంశంపై మాట్లాడారు. సానుకూల ఆలోచనలు, నిబద్ధత, విమర్శ, శిక్షణ, నైపుణ్యత, సమయపాలన, శాశ్వత అభ్యాసన, అసాధారణ వైఖరిలను అలవరచుకోవాలని సూచించారు. ప్రతి రోజు కొత్త గోల్‌ను పెట్టుకోవాలని, దాన్ని అధిగమిస్తూ ఉండాలని చెప్పారు. కంపెనీ ఉద్యోగుల మీద నమ్మకం, ప్రతి రోజు శిక్షణ, ట్రాకింగ్‌ ఉండాలని పేర్కొన్నారు.

లక్ష్యం ఎందుకు?
లక్ష్యం పెట్టుకోవటం గొప్ప కాదు.. ఎందుకోసం లకి‡్ష్యంచామో స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. పనిచేయడానికి ఉత్తమ స్థలం, ఉత్తమ ఉత్పత్తి, అవార్డ్‌లు, రివార్డ్‌లు, కమ్యూనిటీ సర్వీస్, అత్యధిక లాభం వీటిల్లో వేటికోసం టార్గెట్‌ను ఎంపిక చేసుకున్నామో విశ్లేషించుకోవాలని సూచించారు. నా వరకైతే ప్రస్తుతం రూ.100 కోట్ల లోపు టర్నోవర్‌ ఆర్క్‌ గ్రూప్‌ను 2030 నాటికి రూ.5 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఆర్క్‌ ఫౌండేషన్‌లో ఇప్పటికే వైద్యులు, ఇంజనీర్లు, క్రీడాకారులుగా ఎదిగిన విద్యార్థులున్నారు. వంద మంది సివిల్‌ సర్వెంట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని తెలిపారు. సమయపాలన, లక్ష్యం, బం ధం, సవాళ్లు.. ఈ నాలుగు అంశాలను సరిగ్గా అమలు పరిస్తేనే ఎంపిక చేసుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. సవాళ్లను అధిగమించే పరిష్కార మార్గాలను కనుగొనగలిగితేనే లక్ష్యాన్ని చేరుకోగలమని అభిప్రాయపడ్డారు.

చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు