భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా

3 Jan, 2023 14:03 IST|Sakshi

ఫిన్‌ టెక్‌ దిగ్గజం భారత్‌పేలోని పరిణామాలు మరోసారి చర్చకు దారి తీశాయి. గత సంవత్సరం సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను తొలగించినప్పటి నుండి కంపెనీ కార్యకలాపాలను పట్టించుకోలేదనే కారణంగా సీఈవో సుహైల్‌ సమీర్‌ను తొలగించేందుకు ఆ సంస్థ యాజమాన్యం సిద్ధమైంది. 

సీఈవో పదవి నుంచి తప్పించి సమీర్‌కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఈ పదవిని కట్టబెట్టనుంది. జనవరి 7నుండి సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత్‌పే ప్రకటించింది. ఇక ప్రస్తుత సీఎఫ్‌ఓ నలిన్ నేగీ తాత్కాలిక సీఈగా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా  భారత్‌పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, సమీర్ తన అద్భుతమైన సహకారం అందించినందుకు,వివిధ సవాళ్లను అధిగమించడంలో కంపెనీకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.   
 
ఎస్‌బీఐ కార్డ్‌లో సీఎఫ్‌ఓగా  
నేగి గతేడాది ఆగస్ట్‌లో భారత్‌పేలో చేరారు. గతంలో అయనకు సుమారు 10 సంవత్సరాల పాటు ఎస్‌బీఐ కార్డ్‌లలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 
 
వరుస రాజీనామాలు 
భారత్‌పే సంస్థలో గత కొద్దికాలంగా జరుగుతున్న వరుస ఘటనలతో నెలల వ్యవధిలో అనేక మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో ఇటీవల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ సహా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు