సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎఫ్​డీలపై ఆదాయపు పన్ను ఎంత?

4 Jul, 2021 20:53 IST|Sakshi

బ్యాంకు ఎఫ్​డీ వడ్డీ రేటు - 5.6 - 6.7%

సుకన్య సమృద్ధి యోజన ఖాతా - 7.6%

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- 7.1%

తక్కువ రిస్క్ తో ఎక్కువ పెట్టుబడి వచ్చే సామాన్య ప్రజానీకం పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు? అలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్​డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్​వై) చాలా ఉత్తమమైన పొదుపు పథకాలు. అయితే, ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై మీరు చెల్లించే ఆదాయపు పన్ను గురుంచి తెలుసుకోవడం చాలా కీలకం. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత సాధించిన అన్ని పెట్టుబడి పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ఈఈఈ హోదాను పొందలేవు.

ఈఈఈ అంటే ఏమిటి?
ఈ అంటే మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు. ఇక్కడ, మొదటి మినహాయింపు అంటే మీ పెట్టుబడి పెట్టె నగదుపై మినహాయింపుకు లభిస్తుంది. కాబట్టి, పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన జీతంలో కొంత భాగంపై మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, రెండో మినహాయింపు అంటే మధ్యలో వైదొలిగినప్పుడు లభించే ఆదాయంపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అర్ధం.

మూడవ మినహాయింపు అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆదాయంపై లభించే వడ్డీ, అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పొందడం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపై సాదరణంగానే ఈఈఈ స్టేటస్ లభిస్తుంది. ఇప్పుడు విభిన్న సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎఫ్​డీ పెట్టుబడుల నుంచే వచ్చే ఆదాయంపై పన్ను ఎంత విధిస్తారో తెలుస్తుంది. 

బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్​డీ)
బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎఫ్​డీలో చేసిన పెట్టుబడిపై వచ్చే వడ్డీపై బ్యాంకు 10శాతం టీడీఎస్ వసూలు చేస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు పీపీఎఫ్ అర్హత కలిగి ఉంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.

సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్​వై)
పీపీఎఫ్ మాదిరిగానే,సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి పథకం. ఈ పథకం ఈఈఈ హోదాను పొందుతుంది. ఎస్ఎస్​వైలో పెట్టుబడి పెట్టిన నగదుపై లభించే వడ్డీపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

వడ్డీ రేట్లు
ఫిక్సిడ్ డిపాజిట్లు అనేది స్థిరమైన వడ్డీ రేట్లకు గ్యారెంటీ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. అయితే, దీనిపై పెట్టె పెట్టుబడిపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులను బట్టి మారుతంటాయి. భారతదేశంలోని టాప్ బ్యాంకులు సాధారణంగా నిర్ధిష్ట డిపాజిట్పై 5.6 - 6.7% వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పీపీఎఫ్ ఎస్ఎస్​వై వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యదాతధంగా ఉంచింది. అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు పాత వడ్డీ రేట్లు ఉంటాయి.

  • సుకన్య సమృద్ధి యోజన ఖాతా - 7.6%
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- 7.1%

చదవండి:  కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త!

మరిన్ని వార్తలు