బ్లూ స్టీల్‌ తయారీపై దృష్టి

30 Oct, 2022 09:15 IST|Sakshi

చెన్నై: బ్లూ స్టీల్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు నగరానికి చెందిన సుమంగళ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, చైర్మన్‌ రాజేంద్రన్‌ సబానాయగం తెలిపారు. శనివారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ఉక్కు తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నామని అన్నారు.

పుదుచ్చేరిలోని తమ ప్లాంట్‌లో బ్లూ స్టీల్‌ను తయారు చేయడానికి ఆధునిక స్క్రాప్‌ ష్రెడర్, థర్మో మెకానికల్‌ ట్రీట్‌మెంట్‌ ఫినిషింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.679 కోట్లు టర్నోవర్‌ నమోదు చేశామని.. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరనున్నట్లు వివరించారు. సంస్థ ప్రెసిడెంట్‌ అశ్విన్‌ పాల్గొన్నారు.

చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఈ బెల్టు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం! 

మరిన్ని వార్తలు