కరోనాకు అతిచవక మందు వచ్చేసింది

4 Aug, 2020 15:56 IST|Sakshi

సన్ ఫార్మా డ్రగ్ ఫ్లూగార్డ్ లాంచ్

టాబ్లెట్  ధర కేవలం  35 రూపాయలు

సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19 కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటినిచ్చే వార్తను సన్ ఫార్మా అందించింది. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను ప్రారంభించినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది. ఈ ఔషధం ఒక్కో టాబ్లెట్ ధరను కేవలం 35 రూపాయలుగా నిర్ణయించింది.

అతి తక్కువ ధరలో ఎక్కువమంది బాధితులకు తమ మందును అందుబాటులోకి తీసుకొచ్చేలా  ఫ్లూగార్డ్‌ను అవిష్కరించామని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. తద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనేది లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం, ఇతరులతో కలిసి పనిచచేయనున్నామని ప్రకటించారు. ఈ వారంలో ఫ్లూగార్డ్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందన్నారు. తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు సంభావ్య చికిత్స కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక నోటియాంటీ-వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ అని ఫార్మా సంస్థ తెలిపింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్  అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఫావిపిరవిర్‌ను అభివృద్ధి చేస్తున్న లేదా విక్రయించే ఇతర భారతీయ ఫార్మా కంపెనీల్లో  గ్లెన్‌మార్క్ ఫార్మా, సిప్లా, హెటెరో ల్యాబ్‌లు  ఉన్న సంగతి విదితమే.

మరిన్ని వార్తలు