నష్టాల్లోకి సన్‌ ఫార్మా

31 May, 2022 06:35 IST|Sakshi

క్యూ4లో రూ. 2,277 కోట్లు

షేరుకి రూ. 3 తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ దేశీ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,277 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 894 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అనుకోని నష్టం ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,464 కోట్ల నుంచి రూ. 9,386 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3,273 కోట్ల  లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 2,904 కోట్ల లాభం మాత్రమే నమోదైంది.   క్యూ4లో మొత్తం రూ. 3,936 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు సన్‌ ఫార్మా పేర్కొంది.

ఫలితాల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 888 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు