అలర్ట్‌, ‘గూగుల్‌ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ ఏంటో తెలుసా!

19 Dec, 2022 21:24 IST|Sakshi

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ సంచలనం నిర్ణయం తీసుకుంది. భార‌త్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవ‌ల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్ష‌న్ సెర్చ్‌’ ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ట్లు ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచ్చాయ్‌  ప్ర‌క‌టించారు.  ఢిల్లీలోని ప్ర‌గతి మైదాన్‌లో జ‌రిగిన  గూగుల్ 8వ ఎడిష‌న్‌లో సంస్థ సీఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ అందుబాటులోకి తేనున‍్న ఫీచర్లను పరిచయం చేశారు. 

ముఖ్యంగా డాక్టర్ల ప్రిస్కప్షన్‌తో పాటు స్థానిక భాషల్లో సమాచారం,మల్టీ సెర్చ్‌ ఇలా రకరకాల ఫీచర్లను గురించి పిచ్చాయ్‌ వివరించారు. దీంతో పాటు గూగుల్‌ పేలో ఈ సరికొత్త ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయనున్నట్లు తెలిపారు. 

ఇదే ఈవెంట్‌లో కేంద్ర టెలీ క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ వ‌ల్ల ప‌లు రంగాల్లో గ‌ణ‌నీయ మార్పులు రానున్నాయ‌నే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు