బీఎస్‌ఈ సీఈవోగా సుందరరామన్‌

6 Jan, 2023 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్‌ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు బీఎస్‌ఈ పేర్కొంది.
 
అయితే ఈ ఆఫర్‌ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్‌ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్‌ ఎక్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈకి తరలి వెళ్లారు. 

దీంతో ఎన్‌ఎస్‌ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్‌ఈ అత్యున్నత పదవిని ఆఫర్‌ చేసింది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు