డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియాకు సునీల్ రాయన్ రాజీనామా!

24 Mar, 2022 17:49 IST|Sakshi

డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియా అధ్యక్షుడు సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. గూగుల్ క్లౌడ్ ఫర్ గేమ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత 2020 జూన్ నెలలో ఆయన కంపెనీ ఆయన కంపెనీలో చేరారు. వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ జారీ చేసిన అంతర్గత మెమోలో రేయాన్ రాజీనామా గురించి సిబ్బందికి తెలియజేశారు.

"సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్'కు నాయకత్వం వహించడానికి అమెరికా నుంచి భారతదేశానికి రావలనే ఉద్దేశ్యంతో సునీల్ 2020 ప్రారంభంలో మాతో చేరారు. కరోనా మహమ్మారి వల్ల ఆ ప్రణాళికలను నిలిచిపోయాయి. అతను జట్టును రిమోట్‌గా నడిపించారు" అని మెమోలో పేర్కొన్నారు. ఏదేమైనా, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో సునీల్, తన కుటుంబం అమెరికాలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయన్ నాయకత్వంలో హాట్‌స్టార్ బృందం గత రెండేళ్లలో "అద్భుతమైన విజయాలు" సాధించిందని మాధవన్ అన్నారు. సునీల్ రాయన్ మే వరకు కంపెనీలో పనిచేస్తారు. సునీల్ రాయన్ ఇంతక ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ఐబీఎం, ఐగేట్ మాస్టెక్, ఇన్ఫోసిస్ సంస్థలలో కూడా పనిచేశారు.

(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్‌.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!)

మరిన్ని వార్తలు