సన్నీ లియోన్ పేరుతో ఎన్‌ఎఫ్‌టీ.. ఇది మరో రికార్డు!

4 Nov, 2021 17:22 IST|Sakshi

అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, మలయాళ నటుడు రిమా కల్లింగల్ వంటి నటులు సరికొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. ఆ బిజినెస్ పేరు ఏంటో తెలుసా? ఎన్‌ఎఫ్‌టీ. ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. 

అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్‌లో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. ఇప్పుడు ఈ ఎన్‌ఎఫ్‌టీ జాబితాలోకి బాలీవుడ్ తార సన్నీ లియోన్ అడుగు పెట్టింది. ఈ జాబితాలోకి ప్రవేశించి ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది.  "మిస్ ఫిట్జ్" పేరుతో ఈ ఎన్‌ఎఫ్‌టీ తీసుకొని వచ్చింది. ఇందులో 9,600 ఎన్‌ఎఫ్‌టీ.లు ఉన్నాయి.
(చదవండి: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?)

ఎన్‌ఎఫ్‌టీకి సంబంధించి వివరాలను సన్నీ లియోన్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. అందులో ఇలా పేర్కొంది.. 'మిస్‌ ఫిజ్‌ను కలవండి! ఇది మిస్‌ ఫిజ్‌ హనీ! ఆమెకు గులాబీ రంగంటే ఇష్టం. టాటూలు వేయించుకున్న కుర్రాళ్లన్నా ఇష్టమే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? సన్నీలియోన్‌ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి' అని సన్నీ ట్వీట్‌ చేసింది. 'ఇదో ప్రైవేట్‌ సేల్‌. వెంటనే విక్రయిస్తాం. నా కలెక్షన్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది సపోర్ట్‌ చేస్తున్నారు. నేనెలాగూ మిస్‌ఫిట్‌నే' అని ఆమె మీడియాకు తెలిపింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎన్‌ఎఫ్‌టీ వేలం మొదటి రోజున $5,20,000 (సుమారు రూ.3.8 కోట్లు) విలువైన అమ్మకాలు జరిగాయి.

(చదవండి: ‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది)

మరిన్ని వార్తలు