టెస్టింగ్‌లో ఫెయిలైన సన్‌ఫార్మ హైబీపీ జెనరిక్‌ డ్రగ్‌: భారీ రీకాల్‌ 

11 Feb, 2023 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశీయ ఫార్మా దిగ్గజం  సన్‌ ఫార్మాకు అమెరికాలో భారీ షాక్‌  తగిలింది. అధిక రక్తపోటు చికిత్సలో వాడే జనరిక్‌  మందు అమెరికా మార్కెట్‌లో డిసల్యూషన్ టెస్టింగ్‌లో  విఫలమైంది. దీంతో  34వేలకు పైగా జెనరిక్ మందుల బాటిళ్లను  రీకాల్ చేస్తోంది.

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని  సన్ ఫార్మాకు చెందిన ఏంజినా అధిక రక్తపోటు,  ఇర్రెగ్యులర్‌ హార్ట్‌ బీట్స్‌ సమస్యకు  చికిత్స చేయడానికి ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్  క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని వాడటంతో తాత్కాలిక లేదా వైద్యపరంగా రివర్సిబుల్ ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణం కావచ్చు లేదా తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య పరిణామాల  సంభవించవచ్చని యూఎస్‌ ఎఫ్‌డీఏ హెచ్చరించింది.  

"స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ(డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్, ఎఫ్‌డీఏ ల్యాబ్‌లో డిసోల్యూషన్ టెస్టింగ్ ఫెయిల్యూర్‌ కారణంగా ప్రభావితమైన లాట్‌ను రీకాల్ చేస్తోంది. ముంబైకి చెందిన డ్రగ్ మేజర్ గుజరాత్‌లోని ప్లాంట్‌లోవీటిని ఉత్పత్తి చేస్తోంది.  ఈ ఏడాది జనవరి 13న క్లాస్ II దేశవ్యాప్తంగా రీకాల్ (అమెరికా)ను  ప్రారంభించింది. కాగా మల్టిపుల్ మైలోమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల విక్రయాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్  ఆమోదం పొందినట్టు  సన్‌ఫార్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు