TATA Chairmanship Dispute: మళ్లీ కోర్టు మెట్లు ఎక్కిన సైరస్‌ మిస్త్రీ.. తెగని టాటా ‘చైర్మన్‌’ వివాదం

28 Feb, 2022 11:38 IST|Sakshi

Tatas vs Cyrus Mistry: టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. టాటా గ్రూపు చైర్మన్‌ విదానికి సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో తనపై చేసిన వ్యాఖ్యలు తొలగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 

ఉప్పు, పప్పుల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల వరకు అనేక రంగాల్లో ఉన్న టాటా గ్రూపుకి సైరస్‌ మిస్త్రీని 2012లో చైర్మన్‌గా నియమించారు. రతన్‌టాటా వారసుడిగా ఆయనకి విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే టాటా గ్రూపు పాటించే విలువలు, ఆశయాలను ముందుకు తీసుకుపోవడంటో మిస్త్రీ విఫలమవుతున్నాడనే కారణంతో నాలుగేళ్ల తర్వాత 2016లో మిస్త్రీని చైర్మన్‌ పదవి నుంచి తొలగించారు.

ఈ వివాదంపై టాటా గ్రూపు, షాపూర్‌జీ పల్లోంజి, సైరస్‌ మిస్త్రీలు కలిసి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. చివరకు అత్యున్నత న్యాయస్థానం మిస్త్రీ తొలగింపును సమర్థించింది.  

మరిన్ని వార్తలు