విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కార కేసు, శిక్ష ఖరారు చేయనున్న సుప్రీం కోర్టు!

10 Jul, 2022 11:18 IST|Sakshi

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్‌ మాల్యాకు వ్యతిరేకంగా సోమవారం భారత అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరపనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.

2017లో విజయ్‌ మాల్యా సుప్రీం కోర్ట్‌ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్‌ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది.

ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్‌కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. కానీ మాల్యా సుప్రీం కోర్టు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్‌ ధిక్కారం కేసుకు సంబంధించి ఏప్రిల్‌11న సుప్రీం కోర్ట్‌ తుది తీర్పు ఇవ్వనుంది. మాల్యాకు వ్యతిరేకంగా శిక్ష ఖరారు కానుంది.

మరిన్ని వార్తలు