జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!

24 Jun, 2021 07:48 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలకు లోనైన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కొనుగోలుకి సురక్షా గ్రూప్‌నకు లైన్‌ క్లియరైంది. రుణదాతలు, గృహ కొనుగోలుదారుల నుంచి సురక్షా బిడ్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లాట్లను కొనుగోలు చేసినా సొంతం చేసుకునేందుకు వీలులేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జేపీ ఇన్‌ఫ్రా వివిధ హౌసింగ్‌ ప్రాజెక్టులను చేపట్టింది. వీటికి సంబంధించి 20,000 మందికిపైగా గృహ కొనుగోలుదారులు ఫ్లాట్ల కోసం వేచిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు  తెలిపాయి. 
10 రోజులుగా.. 
జేపీ ఇన్‌ఫ్రా టేకోవర్‌కు అటు పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌బీసీసీ, ఇటు సురక్షా గ్రూప్‌ వేసిన బిడ్స్‌పై 10 రోజులపాటు వోటింగ్‌ ప్రాసెస్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సురక్షా గ్రూప్‌ బిడ్‌కు 98.66 శాతం మద్దతు లభించినట్లు తాజాగా రిజల్యూషన్‌ అధికారి అనుజ్‌ జైన్‌ వెల్లడించారు. ఎన్‌బీసీసీకి 98.54 శాతం వోట్లు లభించినట్లు తెలియజేశారు. వెరసి అతిస్వల్ప మార్జిన్‌తో సురక్షా గ్రూప్‌ ముందంజ వేసినట్లు వివరించారు.

చదవండి :  ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం

మరిన్ని వార్తలు