ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే రూ. 25 లక్షల బీమా మీ సొంతం..!

6 Aug, 2021 20:58 IST|Sakshi

కోవిడ్‌-19 రాకతో అనేక కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాయి. అనేక కుటుంబాలు అప్పులు ఊబిలో చిక్కుకున్నాయి. ఇన్సురెన్స్‌ కలిగిన కుటుంబాలు కాస్త అప్పులబారిన పడకుండా నిలిచాయి. ప్రస్తుతం చాలా మంది హెల్త్‌ ఇన్సురెన్స్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సరికొత్త  హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.  

బ్యాంకులో సేవింగ్‌ అకౌంట్‌ను తీసుకున్న ఖాతాదారులకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందించనుంది. అంతేకాకుండా మూడు ప్రధాన ఆఫర్లను ఖాతాదారులకు సూర్యోదయ బ్యాంకు ఇవ్వనుంది. ఈ బ్యాంకులో ఖాతా తీసుకున్న ఖాతాదారులకు రూ. 25 లక్షల టాప్‌ అప్‌ ఆరోగ్య భీమా లభిస్తుంది. దీంతో పాటుగా వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ, ఆన్‌ కాల్‌ అత్యవసర అంబులెన్స్‌ వైద్య సంరక్షణ సేవలను సూర్యోదయ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంకు అందిస్తుంది. అకౌంట్‌ను ఓపెన్‌ చేసిన ఒక సంవత్సర కాలంపాటు టాప్‌ ఆప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌కేర్‌ ప్యాకేజీలను ఉచితంగా ఇవ్వనుంది.

2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 102 ప్రదేశాలలో 20 కి.మీ దూరం వరకు ఉచిత అంబులెన్స్ సేవను ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ఆఫర్లను పొందాలంటే ఖాతాదారులు సగటున నెలసరి బ్యాలెన్స్‌ రూ. 3 లక్షల వరకు మెయింటెన్‌ చేయాల్సి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా హెల్త్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌కు అనుగుణంగా ఖాతాదారుడు అర్హతను సాధించాల్సి ఉంటుంది. 

హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సేవింగ్‌ ఖాతా ప్రయోజనాలు..

  • కాంప్లిమెంటరీ టాప్‌-అప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ రూ. 25 లక్షలు. 5 లక్షల కంటే ఎక్కువ వైద్య ఖర్చులు అయితేనే ఈ అమౌంట్‌ను పొందవచ్చును.
  • ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో సెల్ఫ్‌తో పాటుగా భార్యకు, ఇద్దరి పిల్లలకు వర్తించనుంది. 
  • ఉచితంగా ఆన్‌లైన్ డాక్టర్ సంప్రదింపులు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆన్‌లైన్ ఫార్మసీ వోచర్‌లు, నెట్‌వర్క్ డిస్కౌంట్ కార్డ్‌తో సహా నలుగురు సభ్యుల వరకు టాప్‌ అప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులో ఉండనుంది. 
  • మార్చి 31, 2022 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సేవలు.
  • సేవింగ్‌ అకౌంట్‌పై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. 
  • ఖాతాదారులకు రూపే ప్లాటినం డెబిట్‌ కార్డును అందిస్తోంది. ఖాతాదారులు ఏటీఎమ్‌ నుంచి ప్రతిరోజు రూ. 1.5 లక్షల వరకు నగదును విత్‌డ్రా చేయవచ్చును.
మరిన్ని వార్తలు