Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో

23 Feb, 2023 13:47 IST|Sakshi

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా కార్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. భారతదేశంలో తక్కువ ధరకే లభించే మారుతి ఆల్టో ధరలకు రెక్కలొచ్చాయి, ఇప్పుడు పాకిస్థాన్‌లో ఆల్టో బేస్ మోడల్ ధర రూ. 21 లక్షలు, కాగా టాప్ మోడల్ రూ. 27 లక్షల వద్ద అందుబాటులో ఉన్నాయి.

పాకిస్థాన్‌లో ఇప్పటికే భారీ ధరలను పెంచిన సుజుకి మరో సారి ధరలను అమాంతం పెంచింది. ఈ కారణంగా సుజుకి బ్రాండ్ కార్లు ఏ దేశంలో లేనంతగా పెరిగాయి. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో బేస్ మోడల్ ధరలు రూ. రూ.3.50 లక్షలు, టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 5.12 లక్షల వరకు ఉన్నాయి.

భారదేశంలో విక్రయించబడుతున్న ఆల్టో ధరలతో పోలిస్తే, పాకిస్థాన్ సుజుకి ఆల్టో ధర సుమారు ఐదు రేట్లు కంటే ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా అన్ని ధరలు భారీగా పెరుగుతున్నాయి, భారతీయ కరెన్సీతో పోలిస్తే పాకిస్థాన్ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది.

సుజుకి ఆల్టో కొత్త ధరలు:

సుజుకి ఆల్టో విఎక్స్: రూ.2,144,000
సుజుకి ఆల్టో విఎక్స్ఆర్: రూ. 2,487,000
సుజుకి ఆల్టో విఎక్స్ఆర్ ఏజిఎస్: రూ. 137,000
సుజుకి ఆల్టో ఏజీఎస్: రూ. 2,795,000


 
సుజుకి వ్యాగన్ ఆర్ కొత్త ధరలు:

వ్యాగన్ ఆర్ విఎక్స్ఆర్: రూ. 3,062,000
వ్యాగన్ ఆర్ విఎక్స్ఎల్: రూ.3,248,000
వ్యాగన్ ఆర్ ఏజీఎస్: రూ.3,563,000

సుజుకి కల్టస్ కొత్త ధరలు:

కల్టస్ విఎక్స్ఆర్: రూ. 3,540,000
కల్టస్ విఎక్స్ఎల్: రూ. 3,889,000
కల్టస్ ఏజిఎస్: రూ. 4,157,000

సుజుకి స్విఫ్ట్ కొత్త ధరలు:

స్విఫ్ట్ జిఎల్ ఎమ్‌టి: రూ. 4,052,000
స్విఫ్ట్ జిఎల్ సివిటి: రూ. 4,335,000
స్విఫ్ట్ జిఎల్‌ఎక్స్ సివిటి: రూ. 4,725,000

సుజుకి రవి కొత్త ధరలు:

సుజుకి రవి: రూ. 1,768,000
సుజుకి రవి డెక్: రూ. 1,693,000

సుజుకి బోలాన్ కొత్త ధరలు:

బోలాన్ వ్యాన్: రూ. 1,844,000
బోలాన్ కార్గో: రూ. 1,852,000 

మరిన్ని వార్తలు