‘స్వరాజ్‌’ నుంచి తేలికపాటి ట్రాక్టర్లు

3 Jun, 2023 09:09 IST|Sakshi

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రాకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ తేలికపాటి ట్రాక్టర్లు రెండింటిని ఆవిష్కరించింది. టార్గెట్‌ 630, టార్గెట్‌ 625 పేరుతో వీటిని మార్కెట్లో విక్రయించనున్నట్టు తెలిపింది. ‘టార్గెట్‌’ శ్రేణిలో 20–30 హెచ్‌పీ విభాగంలో వీటిని తీసుకురానున్నట్టు ప్రకటించింది.

ఇందులో టార్గెట్‌ 630 ముందుగా మహారాష్ట్ర, కర్ణాటకలో రూ.5.35 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరపై అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇక టార్గెట్‌ 625 మోడల్‌ ట్రాక్టర్‌ను స్వల్ప వ్యవధిలోపు తీసుకొస్తామని తెలిపింది. తక్కువ బరువుతో సౌకర్యంగా ఉండే (కాంపాక్ట్‌ లైట్‌ వెయిట్‌) ట్రాక్టర్ల కోసం రూ.200 కోట్ల తో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్టు స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ ప్రకటించింది.

ఈ ప్లాట్‌ఫామ్‌ నుంచే ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించడం గమనార్హం. ఇక ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాంపాక్ట్‌ లైట్‌ వెయిట్‌ విభాగంలో 27–30 శాతం వాటా సొంతం చేసుకోవాలన్న ప్రణాళికతో సంస్థ ఉంది.    

మరిన్ని వార్తలు