ఎలక్ట్రిక్ స్కూటర్ భలే ఉంది కదూ!.. రేంజ్ ఎంతో తెలుసా?

23 Mar, 2022 21:42 IST|Sakshi

ప్రముఖ స్వీడిష్ స్టార్టప్ స్టిల్ రైడ్ కంపెనీ ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో పోలిస్తే భిన్నంగా స్కూటర్లను తయారు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సహాయంతో తేలికపాటి, మన్నికైన ఫ్రేమ్ ఉత్పత్తి చేయడానికి పునర్వినియోగపరిచే ఉక్కును అభివృద్ధి చేసింది. స్టిల్ రైడ్ కంపెనీ origami అని పిలిచే ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉక్కును స్టిల్ రైడ్ స్పోర్ట్ యుటిలిటీ స్కూటర్ వన్(SUS1) తయారీలో వినియోగించనున్నారు. ఈ ఏడాది చివరి యూరోపియన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పీఎమ్ఎస్ఎమ్ హబ్ ఉంది. అంతే కాకుండా దీనిలో 6 కిలోవాట్ సామర్ధ్యం గల బ్యాటరీ ప్యాక్'తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. స్టిల్ రైడ్ స్పోర్ట్ యుటిలిటీ స్కూటర్ వన్ స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లనుంది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ స్కూటర్. విభిన్న రోడ్లను బట్టి ఇది అనేక రైడింగ్ మోడ్'లను అందిస్తుంది. స్కూటర్'కు స్పీడోమీటర్ ఉంది. రైడర్ భద్రత కోసం దీనిలో USD ఫోర్క్ బ్రేకింగ్ సిస్టమ్, సింగిల్ సైడ్ డిస్క్ బ్రేక్, సుప్రీం సస్పెన్షన్ ఉంటాయి. ఇది 13-అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ వరకు దూసుకెళ్లనుంది.

(చదవండి: ఇన్సురెన్స్‌ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి)

మరిన్ని వార్తలు