స్విగ్గీకి పెరిగిన నష్టాలు

3 Jan, 2023 14:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టాఫ్లర్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్‌వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది.

చదవండి: గుడ్‌ న్యూస్‌: ఏటీఎం కార్డ్‌ లేకుండా క్యాష్‌ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!

మరిన్ని వార్తలు