స్విగ్గీ న్యూ డెసిషన్‌... ఇవి కూడా డెలివరీ చేస్తుందట

21 Jul, 2021 10:28 IST|Sakshi

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ సి​గ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్‌ డెలివరీలో తన మార్క్‌ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది.

గ్రోసరీస్‌
ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్‌కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్‌ సిటీస్‌ వరకు డెలివరీ సర్వీసెస్‌లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్‌, డిన్నర్‌కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్‌ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా,  పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్‌ వేసింది. త్వరలోనే ఇన్‌స్టామార్ట్‌ పేరుతో గ్రోసరీస్‌ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్‌ శ్రీహర్ష తెలిపారు. 

దూకుడుగా
కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్‌ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్‌లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. 
 

మరిన్ని వార్తలు