Swiggy: యూజర్లకు స్విగ్గీ షాక్‌.. పాస్వర్డ్‌ షేరింగ్‌ కుదరదు!

12 Feb, 2023 11:27 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ యాజర్లకు షాక్‌ ఇచ్చింది. స్విగ్గీ వన్‌ పేరుతో తీసుకొచ్చిన మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు గరిష్టంగా రెండు ఫోన్లలో మాత్రమే లాగిన్‌ అయ్యేలా పరిమితి విధించింది. పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఇదివరకే ఇలాంటి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ పరిమితిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ద్వారా యూజర్లు తగ్గిపోవడమే కాకుండా తమ ఆదాయానికి కూడా గండి పడుతుండటంతో స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసిన మార్పులపై స్విగ్గి తమ యూజర్లందరికీ ఈ-మెయిల్స్‌ పంపించింది. దీని ప్రకారం స్విగ్గీ వన్‌ కస్టమర్లు ఒకే అకౌంట్‌ను రెండు కంటే ఎక్కువ ఫోన్లలో వినియోగించలేరు. 

స్విగ్గీ వన్‌ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉద్దేశించిందని, తాజాగా తీసుకొచ్చిన పరిమితితో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ కోసం కస్టమర్ల నుంచి నెలకు రూ.75లను స్విగ్గీ తీసుకుంటోంది. అదే మూడు నెలలకు అయితే రూ.299, సంవత్సరానికైతే రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.

(ఇదీ చదవండి: Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ మాత్రం అదుర్స్‌!)

మరిన్ని వార్తలు