20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు..

14 May, 2022 18:51 IST|Sakshi

స్విగ్గీ చేతికి డైన్‌ఔట్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ డైన్‌ఔట్‌ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ టైమ్స్‌ ఇంటర్నెట్‌తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. 20 నగరాల్లో 50,000 పైచిలుకు రెస్టారెంట్లలో డిస్కౌంట్స్‌తోపాటు టేబుల్స్‌ రిజర్వ్‌ చేసుకునే సౌకర్యాన్ని డైన్‌ఔట్‌ కల్పిస్తోంది.

కొనుగోలు తర్వాత కూడా డైన్‌ఔట్‌ స్వతంత్య్ర యాప్‌గానే కొనసాగుతుందని స్విగ్గీ శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్‌ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక కంపెనీలను టైమ్స్‌ ఇంటర్నెట్‌ కలిగి ఉంది. కంపెనీల నిర్వహణ, పెట్టుబడులను కొనసాగిస్తోంది.   
 

చదవండి: Infosys: కేంద్రం వర్సెస్‌ ఇన్ఫోసిస్‌.. బిగుస్తున్న పీటముడి

మరిన్ని వార్తలు