Swiggy Drone Deliveries: స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్‌ కొడితే చాలు!

4 May, 2022 11:42 IST|Sakshi

డెలివరీ రంగంలో సరికొత‍్త విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌ ఇకపై కస్టమర్లకు కావాల్సిన గ్రాసరీస్‌ను డ్రోన్‌ల ద్వారా డ్రోన్‌ పోర్ట్‌కు డెలివరీ చేయనుంది.    

బెంగళూరు కేంద్రంగా స్విగ్గీకి చెందిన గ్రాసరీ సర్వీస్‌ ఫ్లాట్‌ ఫామ్‌ 'ఇన్‌ స్టామర్ట్‌'లో ఇన్ని రోజులు కస్టమర్లకు వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని డెలివరీ బాయ్స్‌తో అందిస్తుండేది. కానీ ఇకపై డెలివరీ బాయ్స్‌ బదులు..డ్రోన్‌లు డెలివరీ చేయనున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ డ్రోన్‌ సర్వీస్‌లు అందించే నాలుగు సంస్థల భాగస్వామ్యంలో డ్రోన్‌ డెలివరీ సర్వీస్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంది. 

డ్రోన్‌తో సరుకుల రవాణా
డిల్లీ -ఎన్‌సీఆర్‌, బెంగళూరులో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ డ్రోన్‌ డెలివరీ ట్రయల్స్‌ను రెండు సార్లు నిర్వహించనున్నట్లు స్విగ్గీ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. ముందస్తుగా గరుడా ఏరోస్పేస్‌ సంస్థ బెంగళూరులో, స్కైఎయిర్‌ మొబిలిటి సంస్థ ఢిల్లీ- ఎన్సీఆర్‌'లలో డ్రోన్స్‌ ద్వారా కస్టమర్లకు కావాల్సిన సరుకుల్ని డ్రోన్‌ పోర్ట్‌కు చేరవేయనుంది. తొలిఫేజ్‌ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత  ఏఎన్‌ఆర్‌ఏ అండ్‌, టెక్‌ ఈగల్‌, మరుట్‌ డ్రోన్‌ టెక్‌ సంస్థలు సెకండ్‌ ఫేజ్‌లో ట్రయల్స్‌ జరపనున్నాయి. 

డ్రోన్‌లతో సరుకుల్ని కస్టమర్లకు డోర్‌ డెలివరీ చేస‍్తుందా?
డార్క్ స్టోర్‌ అంటే రీటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ లేదా అవుట్‌ లెట్‌లలో ఉన్న సరుకుల్ని డ్రోన్‌లే..డ్రోన్‌లు ఉండే ఏరియా(డ్రోన్‌ పోర్ట్‌) కు తీసుకొస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.

కేంద్ర అనుమతుల్లేవు..కానీ
ఈ డ్రోన్‌ డెలివరీకి కేంద్రం అనుమతులు ఇవ్వులేదు. డ్రోన్‌ డెలివరీ బి హైండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్స్‌ (బీవీఎల్ఓఎస్‌) మీద ఆదారపడి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ గతేడాది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియన్స్‌ శాఖ కేవలం 20సంస్థలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందులో స్విగ్గీతో పాటు ఏఎన్‌ఆర్‌ఏ అండ్‌, టెక్‌ ఈగల్‌, మరుట్‌ డ్రోన్‌ టెక్‌ సంస్థలు ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయ్‌!
మనదేశంలో డ్రోన్‌ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా హెల్త్‌ కేర్‌ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ అవసరం ఏర్పడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ సమయంలో వ్యాక్సిన్లు, కరోనా బాధితులకు కావాల్సిన మెడిసిన్‌లు డ్రోన్‌ల సాయంతో డెలివరీ చేసేందుకు ట్రయల్స్‌ నిర్వహించాయి. ఇప్పటికే మన దేశానికి గుర్‌గావ్‌ కేంద్రంగా లాజిస్టిక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ డ్రోన్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రోన్‌లను తయారు చేసే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ డ్రోన్ డెలివరీ యూనిట్ వింగ్ టెక్సాస్‌, డల్లాస్‌ వాల్‌గ్రీన్స్ నుండి మెడిసిన్‌లను డ్రోన్‌ డెలివరీ చేసింది.

చదవండి👉స్విగ్గీ బంపరాఫర్‌: డెలివరీ బాయ్స్‌ కష్టాలకు చెక్‌..కళ్లు చెదిరేలా జీతాలు!

మరిన్ని వార్తలు