భారతీయల స్విస్‌ సంపదపై కేంద్ర ఆర్థిక‌ మంత్రిత్వ‌శాఖ‌ కీలక వ్యాఖ్యలు

19 Jun, 2021 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచిన న‌ల్ల‌ధ‌నంపై వచ్చిన వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. భార‌తీయులు స్విస్ బ్యాంకుల్లో గ‌త 13 ఏళ్ల‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు 2020లో చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు రాగా కేంద్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.

స్విస్‌ నల్లధనం.. అసలు కథేంటి
ఈ వార్తలో ఏముందంటే.. 2019లో స్విస్‌ బ్యాంకుల్లో భార‌తీయుల ధనం 6625 కోట్లుగా ఉండగా, గ‌త ఏడాది ఏకంగా 20 వేల కోట్లకు చేరిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం పేర్కొంది. కాగా ఈ వార్త‌పై కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాల‌యం స్పందిస్తూ.. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు స‌మ‌ర్పించిన మొత్తం లెక్కలు త‌ప్పుగా చిత్రీక‌రించిన‌ట్లు ఆర్థిక శాఖ వెల్ల‌డించింది.

అది కేవ‌లం స్విట్జ‌ర్లాండ్‌లో దాచుకున్న భార‌తీయుల సొమ్ము కాదు అని వెల్లడించింది. ఇదే క్రమంలో 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన భార‌తీయల సమాచారాన్ని సేక‌రిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం తెలిపింది. డిపాజిట్లు త‌గ్గిన‌ట్లు చెప్తున్న ప్ర‌భుత్వం, ఎంత మొత్తం అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా
మొత్తం స్విస్‌ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో సుమారు 2 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 600 బిలియన్‌ డాలర్లు ఫారన్‌ కస్టమర్‌ డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. 377 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో బ్రిటన్‌ ముందు నిలవగా, 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 

చదవండి: మరో కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా..!


 

మరిన్ని వార్తలు