స్విచ్‌ మొబిలిటీ ఈవీ12 ఈ–బస్‌ 

15 Jun, 2022 02:39 IST|Sakshi

చెన్నై: అశోక్‌ లేలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన విభాగమైన స్విచ్‌ మొబిలిటీ ఈవీ12 పేరుతో ఈ–బస్‌ను ఆవిష్కరించింది. నగరంలో, నగరాల మధ్య, సిబ్బంది రవాణా, పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే రకాన్నిబట్టి 100–300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు స్విచ్‌ మొబిలిటీ డైరెక్టర్‌ మహేశ్‌ బాబు తెలిపారు.

బస్‌ ఖరీదు రూ.1 కోటి ఉంటుందన్నారు. 600లకుపైగా బస్‌లకు ఆర్డర్లు ఉన్నాయని వివరించారు. వచ్చే మూడేళ్లలో స్విచ్‌ మొబిలిటీ రూ.2,810 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ చైర్మన్‌ ధీరజ్‌ హిందూజా వెల్లడించారు. కొత్త ఉత్పత్తుల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి కేంద్రం స్థాపనకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలను సైతం పరిచయం చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు