టఫే నుంచి ప్రీమియం ట్రాక్టర్లు

10 May, 2022 09:01 IST|Sakshi

హైదరాబాద్‌: ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టఫే) తాజాగా ఐషర్‌ బ్రాండ్‌లో ప్రైమా జీ3 సిరీస్‌ పేరిట ప్రీమియం ట్రాక్టర్లను ఆవిష్కరించింది. స్టైల్, దృఢత్వం కోరుకునే కొత్త తరం రైతుల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. సామర్థ్యంపరంగా 40–60 హెచ్‌పీ శ్రేణిలో ఇవి ఉంటాయని టఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్‌ తెలిపారు. ఇంధనం ఆదా చేయడంతో పాటు ఉత్పాదకత అత్యధిక స్థాయిలో ఉండేలా వీటిని తీర్చిదిద్దినట్లు ఆమె పేర్కొన్నారు.

ఎత్తు సర్దుబాటు చేసుకోగలిగే సీటు, వైవిధ్యమైన ఏరోడైనమిక్‌ హుడ్, డిజి నెక్ట్స్‌ డ్యాష్‌బోర్డు, వన్‌ టచ్‌ ఓపెన్‌ బానెట్‌ తదితర ఫీచర్లు ఈ ట్రాక్టర్లలో ఉంటాయి. దేశీయంగా యువ రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతికత ఊతంతో గరిష్ట రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వారికి అనువుగా ఉండేలా జీ3 సిరీస్‌ ట్రాక్టర్లను ఆవిష్కరించినట్లు మల్లికా శ్రీనివాసన్‌ వివరించారు.   
చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు!

మరిన్ని వార్తలు