తనిష్క్‌ అక్షయ తృతీయ ఆఫర్లు 

2 May, 2022 02:13 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్‌ అక్షయ తృతీయ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.200, వజ్రాభరణాలపై 20% వరకు తగ్గింపు అందిస్తోంది.  గోల్డ్‌ కాయిన్ల సులభతర కొనుగోళ్లకు  ‘24కే ఎక్స్‌ప్రెస్‌’ పేరిట గోల్డ్‌ కాయిన్‌ ఏటీఎంలను లాంచ్‌ సంస్థ చేసింది. తనిష్క్‌ ఫ్లాగ్‌షిప్‌ స్టోర్లలో ఈ ఏటీఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది.    

మరిన్ని వార్తలు