సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్..!

16 Mar, 2022 15:08 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ తన టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారులో మరో కొత్త వేరియంట్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల టాటా ఆల్ట్రోజ్ డీసిటీ కారు ధరను 21 మార్చి, 2022న వెల్లడించనున్నట్లు ప్రకటించింది. త్వరలో రాబోయే ఈ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆటోమేటిక్ గేర్ బాక్స్ సహాయంతో పనిచేయనుంది. ఇప్పటికే ఈ కారుకి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. ₹21,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి టాటా ఆల్ట్రోజ్ ఏటీ కార్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కారు గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్ అవుట్ పుట్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్'తో పని చేయనుంది. ఇందులో డీసిటీ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. టాటా మోటార్స్ ఈ కారును జనవరి 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు దాని ఆటోమేటిక్ వేరియంట్ తీసుకురాబోతోంది. కంపెనీ గత కొంత కాలంగా టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను నిరంతరం భారత రోడ్లపై పరీక్షిస్తోంది. గతంలో, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. దీనిని పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే తీసుకొస్తున్నట్లు సమాచారం. 

(చదవండి: రంగంలోకి టాటా గ్రూప్‌..! గూగుల్‌ పే, ఫోన్‌పేలకు ధీటుగా!)

మరిన్ని వార్తలు