కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను

25 Sep, 2020 11:47 IST|Sakshi

కాఫీ డే వెండింగ్ బిజినెస్  కొనుగోలుకు టాటా కన్స్యూమర్  ప్రయత్నాలు

సాక్షి, ముంబై : కెఫే కాఫీ డే యజమాని సిద్ధార్థ  సంచలన ఆత్మహత్య సంక్షోభంలో పడిన సంస్థ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.కాఫీడే కంపెనీకి చెందిన కాఫీ వెండింగ్ మెషిన్ వ్యాపారాన్ని   కొనుగోలు చేసేందుకు  టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్  యోచిస్తోంది. దీనికి సంబందించిన చర్చల అనంతరం, ఈ ప్రతిపాదనకు టాటా బోర్డు అనుమతినిచ్చినట్టు విశ్వసీనయ వర్గాల సమాచారం.  కాఫీడే వెండింగ్ వ్యాపారం రూ. 2 వేల కోట్లు  (271 మిలియన్ డాలర్లు) ఉంటుందని  అంచనా. భారతదేశపు అతిపెద్ద కాఫీ తయారీ సంస్థ కాఫీ డే, వ్యవస్థాపకుడు సిద్ధార్థ అనూహ్య మరణం తరువాత అప్పులు చెల్లించేందుకు  కంపెనీతీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతోంది. అలాగే గతంలో కార్పొరేట్ బిజినెస్ పార్కును బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఇంక్‌కు విక్రయించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇరు సంస్థలు అధికారికంగా  స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు