బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?

18 Mar, 2023 15:43 IST|Sakshi

వ్యాపార విస్తరణపై దృష్టి కొనసాగింపు 

న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్‌ వాటర్‌ బిజినెస్‌ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్‌ పడినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్‌ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్‌ తెలియజేసింది. ప్యాకేజ్డ్‌ వాటర్‌ బిజినెస్‌ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్‌: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!

ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్‌ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది.

కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్‌ విక్రయానికి టీసీపీఎల్‌తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్‌ చౌహాన్‌ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్‌ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్‌ కు ఇప్పటికే హిమాలయన్‌ బ్రాండుతో బాటిల్డ్‌ వాటర్‌ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి.  
 

>
మరిన్ని వార్తలు