మెప్పించిన టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌

22 Oct, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ (టీసీపీఎల్‌) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో పనితీరు పరంగా మెప్పించింది. నికర లాభం 36 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం ఎగసి రూ.3,363 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభం రూ.286 కోట్లు, ఆదాయం రూ.3,033 కోట్ల చొప్పున ఉన్నాయి. వ్యయాలు 12 శాతం వరకు పెరిగి రూ.3,022 కోట్లకు చేరాయి. భారత్‌లో వ్యాపారం బలమైన పనితీరు చూపించినట్టు టీసీపీఎల్‌ గ్రూపు సీఎఫ్‌వో ఎల్‌ కృష్ణకుమార్‌ తెలిపారు.

ముఖ్యంగా ఆహారోత్పత్తుల వ్యాపారం గొప్ప పనితీరు చూపించిందన్నారు. భారత మార్కెట్‌ నుంచి ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా ఉంది. ఫుడ్స్‌ బిజినెస్‌ ఆదాయం 29 శాతం వృద్ధిని చూసింది. టాటా సంపన్న్, నీటి వ్యాపారం ఆదాయం డబుల్‌ డిజిట్‌ స్థాయిలో పెరిగింది. ప్యాకేజ్డ్‌ పానీయాల వ్యాపారం 7 శాతం క్షీణించింది. టాటా స్టార్‌ బక్స్‌ ఆదాయం 57 శాతం పెరిగింది. ఉప్పు వ్యాపారంలో మార్కెట్‌ వాటాను పెంచుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సునీల్‌ డిసౌజ తెలిపారు.

చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్‌ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు