టాటా యూపీఐ పేమెంట్‌ యాప్‌ వచ్చేస్తోంది!

16 Mar, 2022 14:34 IST|Sakshi

గూగుల్‌ పే, ఫోన్‌పేలకు టాటా గ్రూప్‌ షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్‌ యూపీఐ పేమెంట్‌ యాప్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం..యూపీఐ పేమెంట్స్‌ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్‌ ఇప్పటికే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్‌ డిజిటల్‌ కామర్స్‌ యూనిట్ తెలిపిందని ఎకనమిక్‌ టైమ్‌ పేర్కొంది. అంతేకాదు ఈ యూపీఐ పేమెంట్‌ కార్యకాలపాల్ని నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. 

నాన్‌ బ్యాంక్‌ సంస్థలు థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్‌ పే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  

భారతదేశంలో ఎక్కువ శాతం యూపీఐ లావాదేవీలు గూగుల్‌ పే లేదా ఫోన్‌పేలో జరుగుతాయి. ఇక పేటీఎం, అమెజాన్‌ పే, వాట్సాప్‌ పే వంటి ఇతర యాప్‌లు మార్కెట్‌ను కలిగి ఉండగా..తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ మధ్య పోటీ తత్వం నెలకొంది. 

మరిన్ని వార్తలు