ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్‌..అందించిన టీఏఎస్‌ఎల్, ఎల్‌అండ్‌టీ!

22 Jun, 2022 11:20 IST|Sakshi

బెంగళూరు: టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్‌ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్‌ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.

100వ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్‌ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్‌ఎల్‌ సీఈవో, ఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు. ఎల్‌అండ్‌టీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ జయంత్‌ పాటి ల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  
 

మరిన్ని వార్తలు