అప్‌డేట్‌ అయ్యింది.. అదిరిపోయే ఫీచర్లు తెచ్చింది

22 Mar, 2022 10:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఆ్రల్టోజ్‌ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.09 లక్షల నుంచి రూ.9.89 లక్షల వరకు ఉంది. యాక్టివ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో వెట్‌ క్లచ్, మెషీన్‌ లెర్నింగ్‌, షిఫ్ట్‌ బై వైర్‌ టెక్నాలజీ, సెల్ఫ్‌ హీలింగ్‌ మెకానిజం, ఆటో పార్క్‌ లాక్, ఆటో హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల టచ్‌ స్క్రీన్, ఐఆర్‌ఏ కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, వెనుకవైపు ఏసీ వెంట్స్‌ వంటి హంగులు ఉన్నాయి. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది తయారైంది.

 ‘సెగ్మెంట్‌–ఫస్ట్‌ ఫీచర్లతో ఆల్ట్రోజ్‌ డీసీఏ కచ్చితంగా కాబోయే కొనుగోలుదార్ల మనసును దోచుకుంటుంది. అడ్డంకులు లేని డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది’ అని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సేల్స్, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ అంబ తెలిపారు. కంపెనీ మార్కెట్‌ వాటాను విస్తరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే 1.25 లక్షల మందికిపైగా కస్టమర్లు ఆ్రల్టోజ్‌ వినియోగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు