టాటా మోటార్స్‌ నుంచి మైక్రో ఎస్‌యూవీ

22 Aug, 2021 10:38 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో నంబర్‌ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్‌ యూటిలిటీ వెహికల్‌ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 

ఎస్‌యూవీకి డిమాండ్‌
ఇండియన్‌ మార్కెట్‌లో గత కొంత కాలంగా ఎస్‌యూవీ వెహికల్స్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. సెడాన్‌లకు ధీటుగా ఎస్‌యూవీ వెహికల్స్‌ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్‌ డిఫరెంట్‌గా ఉండటమే ఇందుకు కారణం. 

పోటీలో టాటా
టాటా నుంచి ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీగా నెక్సాన్‌ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్‌యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్‌యూవీ పేరుతో టాటా హెచ్‌బీఎక్స్‌ను మార్కెట్‌లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్‌లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్‌లో వెలువడింది.

ఎంట్రీ లెవల్‌లో పోటీ
టాటాలో టాప్‌ ఎండ్‌ ఎస్‌యూవీగా ఉన్న హారియర్‌, సఫారీ తరహా ఎక్స్‌టీరియర్‌, ఆల్ట్రోజ్‌ తరహా ఇంటీరియర్‌తో హెచ్‌బీఎక్స్‌ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్‌ మోడల్‌ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్‌, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న హ్యుందాయ్‌ క్యాస్పర్‌లకు టాటా హెచ్‌బీఎక్స్‌ పోటీ విసరనుంది.

చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్‌..!

మరిన్ని వార్తలు