భారీ డీల్‌ను కైవసం చేసుకున్న టాటా మోటార్స్‌..!

7 Apr, 2022 15:57 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం కమర్షియల్‌ వాహనాల ధరలను పెంచుతూ టాటా మోటార్స్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కమర్షియల్‌ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ నుంచి టాటా మోటార్స్‌ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది. 

1300 కమర్షియల్‌ వాహనాల ఆర్డర్‌..!
భారత్‌లో లాజిస్టిక్‌ సేవల్లో పేరుగాంచిన వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్‌ కమర్షియల్‌ వెహికల్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకుగాను టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్‌ను ఇచ్చింది. సుమారు  1,300 వాణిజ్య వాహనాలను ఆర్డర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్‌లో టాటా మోటార్స్  మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్, ఇంటర్మీడియట్ & లైట్ కమర్షియల్ వెహికల్ శ్రేణికి చెందిన వాహనాలు ఉన్నాయి. వీటితో దేశ వ్యాప్తంగా లాజిస్టిక్స్ కార్యకలాపాలను చేసేందుకు సరిపోతాయని వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్ లిమిటెడ్‌ అభిప్రాయపడింది. ఈ భారీ డీల్‌ సందర్భంగా  టాటా మోటార్స్ సేల్స్ & మార్కెటింగ్ వీపీ రాజేష్ కౌల్ మాట్లాడుతూ...వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్ లిమిటెడ్ నుంచి 1300 వాహనాల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ను పొందడం మాకు చాలా ఆనందంగా ఉందని, మా వాహనాలు వారి కార్యకలాపాలకు గొప్ప విలువను తెస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

నెక్స్ట్‌ జెన్‌ సొల్యూషన్స్‌తో..!
వాణిజ్య వాహనాల శ్రేణిలో  ఫ్లీట్ ఎడ్జ్ అని పిలిచే టాటా మోటార్స్ నెక్స్ట్-జెన్ డిజిటల్ సొల్యూషన్ టాటా మోటార్స్‌ పరిచయం చేసింది. ఇది స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌తో రానుంది. పలు ఫీచర్స్‌తో, యాజమాన్యం ఖర్చు తగ్గించేందుకు ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్‌లో  భాగంగా ఫుల్‌ ఫ్లెడ్జ్‌ సర్వీసెస్‌, రిపేర్ టైమ్ హామీ, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇన్సూరెన్స్ , యాక్సిడెంటల్ రిపేర్ టైమ్, ఎక్సెటెండెడ్‌ వారంటీతో పాటుగా ఇతర యాన్‌ ఆన్‌ సేవలతో అందిస్తోంది. 

చదవండి: కాచుకోండి.. వచ్చేస్తోంది టాటా గ్రూప్స్‌ యాప్‌..!

>
మరిన్ని వార్తలు