టాటా మోటార్స్‌: ఏటా రూ.2,000 కోట్ల వ్యయం

27 Sep, 2022 09:32 IST|Sakshi

టాటా మోటార్స్‌ ఈడీ గిరీష్‌

వాణిజ్య వాహన విభాగంలో ఏటా రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్స్, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్టు సంస్థ ఈడీ గిరీష్‌ వాఘ్‌ సోమవారం తెలిపారు. యోధ 2.0, ఇంట్రా వీ50, సీఎన్‌జీ, పెట్రోల్‌తో నడిచే ఇంట్రా వీ20 పికప్‌ వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘పికప్స్‌ విభాగంలో కంపెనీతోపాటు, పరిశ్రమ ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేస్తుంది. టాటా ఏస్‌ ఈవీ వాహనాలు అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలైంది. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయి. నూతన పికప్‌ వాహనాలు అధిక సామర్థ్యం, ఎక్కువ బరువు మోయగలిగి, అధిక దూరం ప్రయాణించేలా రూపొందించాం’ అని వివరించారు.

చదవండి:  Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్‌ కార్డు కట్‌!

మరిన్ని వార్తలు