తుక్కు వ్యాపారంలోకి టాటా గ్రూప్‌

18 Nov, 2021 09:28 IST|Sakshi

తుక్కు కేంద్రాలపై టాటా మోటార్స్‌ దృష్టి 

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ విధానంలో వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్‌ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి కేంద్రం అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఈడీ గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా 25,000 ట్రక్కులు తుక్కుగా మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయని, కానీ సరైన స్క్రాపేజీ కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్‌కు చెందిన నిపుణులతో కలిసి మోడల్‌ స్క్రాపింగ్‌ కేంద్రాన్ని రూపొందించామని వాఘ్‌ పేర్కొన్నారు. 

ఫ్రాంచైజీ విధానంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. ఇప్పటికే భాగస్వాములకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) పంపించడం మొదలు పెట్టామని వివరించారు. స్క్రాపేజీ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు రాగలవనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతోందని వాఘ్‌ వివరించారు. అహ్మదాబాద్‌లో వాహనాల స్క్రాపేజీ సెంటర్‌ నెలకొల్పడానికి గుజరాత్‌ ప్రభుత్వంతో టాటా మోటార్స్‌ ఇటీవలే చేతులు కలిపింది.

మరిన్ని వార్తలు