టాటా మోటార్స్ జోరు తగ్గట్లేదుగా!

25 Oct, 2021 19:45 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లీడర్‌గా అవతరించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అయ్యింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో 2 బిలియన్ డాలర్ల(రూ.15,000 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దం అవుతుంది. వరుసగా 10 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు ప్రణాళికా కూడా సిద్దం చేస్తుంది. మన దేశంలో ఇంత వేగంగా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రణాళికలు రచిస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది టాటా మోటార్స్ అని చెప్పుకోవాలి.

ఈ సంధర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వేహికల్స్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "మా కంపెనీ ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు ప్రణాళిక కలిగి ఉంది. వచ్చే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో ఈవీ వాహనాల అమ్మకాలు 20 శాతం చేరుకుంటాయని అంచనా. ప్రస్తుతం కేవలం రెండు కార్లతో(నెక్సన్, టిగోర్ ఈవీ) మేము నెలకు 3,000-3,500 యూనిట్ల బుకింగ్స్ పొందుతున్నాము. అయితే, వాస్తవానికి మేము సుమారు 1,000 యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాము. ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం 2 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) వరకు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. ఈ పెట్టుబడులను కొత్త ఈవీ వాహనాలను తీసుకొనిరావడం కోసం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం, మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం వినియోగిస్తాము" అని ఆయన చెప్పారు.

(చదవండి: ఎలక్ట్రిక్‌ కార్లలో సంచలనం సృష్టించిన భారత కంపెనీ..!)

మరిన్ని వార్తలు