మారుతిపై ప్రత్యర్థి ‌సెటైర్లు

24 Nov, 2020 16:11 IST|Sakshi

వ్యాగన్‌ ఆర్‌పై టాటా మోటార్స్‌ సెటైర్లు

సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్‌ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్‌ ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా  చేసుకుంది.  మారుతి సుజుకి  వాహనం వ్యాగన్‌ఆర్‌పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్‌ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా  వ్యంగ్యంగా ట్వీట్‌ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి  ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది.  (ఎస్‌బీఐతో బెంజ్‌ జట్టు: ప్రత్యేక ఆఫర్లు)

చక్రం ఊడిపోయిన ఇమేజ్‌ను ట్వీట్‌​ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్‌గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్‌లో కావాలనే  ‘R’చేర్చడం గమనార్హం.  మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్‌సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీ రేటింగ్‌ దారుణంగా ఉండగా,  టాటా మోటార్స్ కార్లు నెక్సాన్,  ఆల్ట్రోజ్  ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్‌ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన  కార్లుగా పేర్కొంటూ  ఫోర్-స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు